AP : వైసీపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

ఎన్నికల వేళ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కాంగ్రెస్‌లో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలీజా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం జగన్ పూతపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూతిరేకుల సునీల్ కుమార్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను అయిన తనను కాదని.. మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు.
ఎం.ఎస్.బాబు 04 మార్చి 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలం, 5 వెంకటాపురం (పిళ్లారిమిట్ట) గ్రామంలో జన్మించారు. ఆయన ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఎం.ఎస్.బాబు వైసీపీలో చేరి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా పని చేస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎల్. లలిత కుమారిపై 29 వేల163 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com