AP : ఏపీలో త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తాం... అని హోం మంత్రి అనిత చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
రాష్ట్ర హోం, విపత్తులు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anita ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉప సంఘంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. దీనిపై ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com