CBN: నా చుట్టూ తిరిగితే లాభం లేదు: చంద్రబాబు

CBN: నా చుట్టూ తిరిగితే లాభం లేదు: చంద్రబాబు
X
ఇక జీవితాంతం టీడీపీ నేతలకు పరీక్షలే... మందలించిన చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలకు ఇకపై ఏ ఎన్నికైనా ఒక పరీక్షే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. " ఇకపై జీవితాంతం మీకు పరీక్షలే - పాస్ అయితే పాసైనట్టు.. ఫెయిల్ అయితే ఫెయిలైనట్లు " అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగోలేని టీడీపీ క్లస్టర్ ఇంఛార్జులను చంద్రబాబు మందలించారు. తన చుట్టూ తిరిగితే లాభం లేదని.. మీ పని ప్రజలు చుట్టూ తిరుగుతూ ఓట్లేయించడం.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమని అన్నారు.

47 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశా: సీఎం

ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నానని... మొత్తంగా 14 ఏళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నానని అన్నారు. పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేశానని... ఇదీ ప్రజలకు తనకిచ్చిన గౌరవమని వెల్లడించారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పం తనదని చంద్రబాబు అన్నారు.

అక్టోబర్ 2 నుంచి చెత్తే కనపడదు

చెత్త రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర పేరుతో చెత్త సేకరణను మరింత వేగవంతం చేసింది. రోడ్లపై ప్రతి రోజు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోగవతుండగా.. 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు. అక్టోబర్ 2న నాటికి ఎక్కడా చెత్త కనిపించకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆ బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించాం. ఆత్మగౌరవం పేరుతో గతంలో మరుగుదొడ్లు నిర్మాణానికి పిలుపునిచ్చాం. 4 లక్షల 60 వేల మరుగుదొడ్లను మళ్లీ నిర్మించబోతున్నామని తెలిపారు.

Tags

Next Story