CBN: జగన్‌తో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన 2024లో లక్షల కోట్లకు ఎలా చేరుకుందని.. చంద్రబాబు ప్రశ్నించారు. కనీస విలువలు పాటించని ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని చంద్రబాబు అన్నారు. తల్లి, చెల్లిని కోర్టుకీడ్చిన జగన్.. ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. విలువలు లేని మనుషులు సమాజానికి చేటని... ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఎప్పుడైనా సాయం చేశారా అని చంద్రబాబు నిలదీశారు. ఇప్పుడేమో వైసీపీ తరఫున రూ.10 లక్షలు ఇస్తామంటున్నారన్నారు. జగన్ దగ్గర ఉన్న అవినీతి సొమ్ము అలాగైనా పేదలకు చేరుతుందని చంద్రబాబు అన్నారు. జగన్ షర్మిల ఆస్తి వివాదంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే తమను అందులోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీదట కుదరదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
షర్మిల ప్రాణాలకు ముప్పు: వర్ల
ఏపీ మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. తల్లి, చెల్లిని వీధికి లాగి ఆస్తి కోసం జగన్ వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. జగన్‌ది పూర్తిగా అనైతిక చర్రిత అని, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. తాజా పరిణమాలు చూస్తుంటే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందనే అనుమానం కలుగుతోందని, ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై కేంద్ర మంత్రి ప్రశంసల వర్షం!
అసలైన IT మ్యాన్ ఏపీ సీఎం చంద్రబాబేనని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఢిల్లీలోని రైల్వే భవన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన మాటలకు బదులు ఇస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు, పవన్, పురందేశ్వరి కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
కల్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నాయి బ్రాహ్మణులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యేతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com