AP CM : నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP CM : నేడు మోదీ, అమిత్ షాతో చంద్రబాబు భేటీ
X

సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) నేడు ప్రధాని మోదీ ( Narendra Modi ), హోం మంత్రి అమిత్ షాతో ( Amit Shah ) సమావేశం కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అవుతారు.

ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమచారం.

ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు.

Tags

Next Story