PAWAN: ప్రజలే.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలోమండిపడ్డారు. వైసీపీకి వచ్చే ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని... ప్రజలే ఆ హోదా జగన్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్‌మోహన్ రెడ్డి జర్మనీ వెళ్లాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "జగన్‌మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో.. 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేది.." అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు 21 సీట్లు రాగా, 11 సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎక్కువ శాతం ఓట్లు వస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుంది. కావాలంటే వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు జర్మనీకి వెళ్లవచ్చు అని ఎద్దేవా చేశారు. గవర్నర్ అనారోగ్యంతో బాధపడినా ప్రసంగించారని, వైసీపీ నేతలు హుందాగా ప్రవర్తించాలని సూచించారు.అసెంబ్లీకి రాగానే గొడవ పెట్టుకోవాలి, రాద్దాంతం చేయాలనే తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
లోటుపాట్లు చెప్పండి
వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలని పవన్ సూచించారు. వైసీపీ వ్యవహార శైలి సమంజసంగా లేదని, సభలోకి రాగానే గొడవ పెట్టుకోవాలనుకోవడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, 11 సీట్లతో ప్రతిపక్ష ఇవ్వరని, చంద్రబాబు, జనసేన నిర్ణయించేది కాదని, దానికి రూల్స్, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో సభ్యులను గెలిపిస్తే మాత్రమే వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని మరోసారి పవన్ స్పష్టం చేశారు. తాను డిప్యూటీ సీఎం కనుక ప్రధాని మోదీ పక్కన కూర్చోబెట్టారు కానీ ప్రత్యేక హోదాతో కాదన్నారు. డిప్యూటీ సీఎంకే ప్రొటోకాల్ ఉండదని.... కేవలం సీఎం చంద్రబాబుకు మాత్రమే ప్రొటోకాల్ ఉంటుందన్నారు. అందుకు తమకు కూడా ప్రొటోకాల్ కావాలని వైసీపీ నేతల తరహాలో డిప్యూటీ సీఎంగా నేను అడగటం లేదన్నారు.
పేరాబత్తులను గెలిపించండి: పవన్ కళ్యాణ్
ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి కూటమి తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్ చేశారు. పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖర్ కు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.
రాజశేఖర్ ను గెలిపించండి: పవన్ కళ్యాణ్
ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి కూటమి తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు ఓటు వేసి గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజశేఖర్ చిత్రపటంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖర్ కు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com