PAWAN: ‘రైతులపై పెట్రోల్ బాంబులు వేసిన చరిత్ర వైసీపీది’
వైఎస్సాఆర్ హయాంలో తీసుకొచ్చిన సరస్వతి పవర్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించారు. దాదాపు అరగంట పాటు భూములు పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడారు. భూములను ఇచ్చేందుకు నిరాకరించిన రైతులను భయపెట్టి, పెట్రో బాంబులు వేసి భూములు లాక్కున్నారని గుర్తు చేశారు. రైతులకు ఇప్పటివరకూ పరిహారం చెల్లించలేదని.. వారి పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సరస్వతీ పవర్ ప్లాంట్ భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్‌కు వివరించారు. సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి సొంతంగా భూములు తీసుకున్నారన్నారు. 2009లో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్లు లీజుకు తీసుకోగా.. జగన్ సీఎం అయిన తర్వాత లీజును మరో 50 ఏళ్లు పొడిగించుకున్నారన్నారు. కానీ, ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదన్నారు.
విచారణకు ఆదేశం
సరస్వతి సిమెంట్ కంపెనీ పేరుతో ఆక్రమించుకున్న భూములపై విచారణ చేపట్టాలని పవన్‌కల్యాణ్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఃసరస్వతి కంపెనీకి భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోలు బాంబులు వేసి భయపెట్టి భూములు లాక్కున్నారని ఆరోపించారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారని, దళితుల భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు, చెరువులు, కుంటలను సైతం రెవెన్యూ భూములుగా చిత్రీకరించి వాటిని స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. రైతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కొనుగోలు చేసిన భూములకు ఇంతవరకు పరిహారం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీకి పర్యావరణ అనుమతులు కూడా లేవని ,30 సంవత్సరాలు లీజును సీఎం జగన్ అయ్యాక 50 సంవత్సరాలకు మార్చుకున్నారని దుయ్యబట్టారు. కట్టని సిమెంట్ కంపెనీకి 198 కోట్ల లీటర్ల కృష్ణ జలాలు మళ్లింపు కోసం రాసుకున్నారని ఆరోపించారు. సిమెంట్ కంపెనీని ఎందుకు చేపట్టలేదని, పరిహారం ఎందుకు అందించలేదు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉండేందుకు వచ్చామని తెలిపారు. రైతులను బెదిరించిన వారిపై పోలీసులు ఉపేక్షించవద్ధని అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధించి చంపారని విమర్శించారు.
రూ.20 లక్షల కోసం కోడెలను వేధించారు
వైసీపీపై పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 లక్షల ఫర్నిచర్ కోసం కోడెల శివప్రసాద్ ను వైసీపీ ప్రభుత్వం వేధించిందన్నారు. మానసికంగా వేధించి చంపేశారంటూ పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com