PAWAN: షర్మిలకు అండగా పవన్

PAWAN: షర్మిలకు అండగా పవన్
X
షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం... షర్మిల బాధ్యత గల నాయకురాలిగా ఏ విమర్శ అయినా చేయొచ్చన్న పవన్...

వైఎస్ కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్‌‍గా మారింది. ఇప్పటికే షర్మిల, జగన్ మోహన్ రెడ్డి పోటా పోటీగా లేఖలు విడుదల చేశారు. కుమార్తెకు మద్దతుగా వైఎస్ విజయమ్మ కూడా బహిరంగ లేఖ విడుదల చేశారు. మరోవైపు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల పంపకాల విషయంపై విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

షర్మిలకు అండగా ఉంటాం

జగన్ సోదరి షర్మిలకు రక్షణ కల్పిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. షర్మిల.. తన ప్రాణాలకు రక్షణ కావాలని... అదనంగా సెక్యూరిటీ కల్పించాలని అడిగారని తెలిపారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని పవన్ అన్నారు. ఓ బాధ్యత గల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చెయ్యొచ్చని... మీరు అప్పీల్ చేసుకోండి. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని పవన్ తెలిపారు. తమ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల రాజకీయ విమర్శలు చేసినా.. ఆమెకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ


ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలపై వైఎస్ జగన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కుటుంబ ఆస్తుల వివాదం కాస్తా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు.. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి కారణం అయింది. వైఎస్ జగన్, షర్మిల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నెలకొంది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతలు కూడా పరస్పరం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నారు. వైఎస్ షర్మిలపై పలువురు వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తుండగా.. అంతే స్థాయిలో కాంగ్రెస్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలకు ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

Tags

Next Story