AP: ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్

AP: ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్
X
FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం... రూ.88 కోట్లతో ల్యాబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో ఆహార భద్రతా తనిఖీల కోసం FSSAI ల్యాబ్‌ తో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. ఆహార భద్రతా తనిఖీల కోసం 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే విశాఖ, తిరుపతి, కర్నూలులో ప్రభుత్వ సహాయంతో మైక్రో బయాలజీ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతోపాటు.. పరీక్షలకు సంబంధించి సిబ్బందికి పలు అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. మూడు ప్రత్యేక ల్యాబ్స్ తోపాటు, జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రతి ల్యాబ్ లో రూ. 21 కోట్లతో మౌలిక వసతులు సమకూర్చనున్నట్టు ఒప్పందంలో ప్రభుత్వం పేర్కొంది. తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

రూ. 88 కోట్లతో ల్యాబ్ ఏర్పాటు

రూ.88కోట్లతో ల్యాబ్స్ ఏర్పాటు, మౌలిక వసతులు, సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చేలా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా విశాఖపట్నం, తిరుమల, కర్నూలులో ఉన్నతస్థాయి మైక్రో బయాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐదు ప్రాథమిక ల్యాబ్స్, 15మొబైల్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఉన్నతస్థాయి ల్యాబ్‌లో రూ.21కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రమాణాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్య కుమార్‌కు ఆహార పదార్థాల్లో కల్తీ, రసాయనాలు వినియోగాన్ని గురించి అధికారులు వివరించారు. రసాయనాలు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పలు రకాల రోగుల బారిన ప్రజలు పడుతున్నారని మంత్రికి అధికారులు తెలిపారు.

వైసీపీపై ఆరోపణలు

గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే ఆహార భద్రత, ప్రమాణాల్లో ఏపీ ర్యాంక్ దిగజారిందింటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ సర్కారు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఆహార భద్రత తనిఖీల కోసం స్పెషల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలుత 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వీటితోపాటు 15 మొబైల్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ కు ఒక్కోదానికి రూ. 21 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అదేవిధంగా విశాఖలో కూడా మైక్రో బయాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story