AP: కొత్త రేషన్ కార్డలు ప్రభుత్వం పచ్చజెండా..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే అందరికీ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసేలా కసరత్తు చేస్తోంది. ఏపీలో ఎన్టీఏ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినేట్ సమావేశం కానుంది. ఇందులో భాగంగనే కొత్త రేషన్ కార్డు అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు పౌర సరఫరా శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుతో పాటు కుటుంబాల విభజన, కుటుంబ సభ్యులను చేర్చడం, కుటుంబ సభ్యుల తొలగింపు, అడ్రస్ విషయంలో మార్పులు, చేర్పులు, పాత కార్డులను సరెండర్ చేయడం వంటి విషయాలపై కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కేబినేట్ సమావేశంలో వాహనాల్లో రేషన్ సరుకుల పంపిణీపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోనని డీలర్లు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు 6వేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు మరో కొత్తగా 4వేలకు పైగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో ఆదాయం రూ.12వేల కంటే ఎక్కువగా ఉంటే రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులు కాదని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో అంగన్ వాడీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. దీంతో తమకు వస్తున్న జీతాలు చాలా తక్కువని, ఈ జీతాలతో కుటుంబాలకు ఎలా పోషించాలని వాపోతున్నారు. కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, మళ్లీ తమకు కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతుల ఖాతాల్లోకి..
గత వైసీపీ ప్రభుత్వం ధ్యానం బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ధాన్యం బకాయిలు రూ. రూ.1674.40 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. తొలత రూ.1000 కోట్లు విడుదల చేయగా..
నేడు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా విజయవాడకు చేరుకోనున్నారు. నేడు మూలా నక్షత్రం సందర్భంగా ప్రభుత్వం తరపున చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గాఘాట్ మోడల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com