Tesla : టెస్లాతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లాతో ( Tesla ) పాటు మరికొన్ని పెద్ద కంపెనీల యాజమాన్యాలకు అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం గురించి వివరిస్తున్నారు. 2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగతా వాటి పరిస్థితి ఏంటన్న దాన్ని విశ్లేషిస్తున్నారు.
2019కి ముందు వివిధ సంస్థలతో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాల్లో గత ఐదేళ్లలో ఎన్ని కార్యరూపం దాల్చాయి? మిగిలిన వాటి పరిస్థితేంటి? ఆ ఒప్పందాలు అమలు కాకపోవడానికి కారణాలేంటి అని అధికారులు విశ్లేషిస్తున్నారు. గత ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.12 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
ఆయా సంస్థలతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పెట్టుబడులు గ్రౌండింగ్ కావడానికి అడ్డంకులేంటి? వాటిని అధికారుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమేనా? ప్రభుత్వం విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందా? అనే అంశాల ఆధారంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల పట్ల సానుకూలంగా ఉందన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలన్నదే ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com