AP Government : రూ.2వేల కోట్ల రుణానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు?

AP Government : రెండు వేల కోట్ల రూపాయల రుణం పొందేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. 20ఏల్ల కాలపరిమితికి వెయ్యి కోట్లు, 16ఏళ్ల కాలపరిమితికి వెయ్యి కోట్లు.. రుణం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొననున్న ప్రభుత్వం.. రుణం పొందేందుకు ప్రతిపాదనలు సమర్పించనుంది. అయితే ఎంత వడ్డీకి రుణం దొరుకుతుంది అన్నది వేలంలో తెలుస్తోంది.
కొత్త పీఆర్సీ, ఇతర అవసరాలు తీర్చడంతో.. ఏపీ ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్‌లో పడినట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటుతో ఈనెల జీతాలు, పెన్షన్లు చెల్లించారు. దీంతో నాలుగు రోజుల్లోగా ఓడీ నుంచి ప్రభుత్వం బయటపడాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే ఏపీ ఆర్థికశాఖ అధికారి ఒకరు ఢిల్లీలో రుణం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయినా చివరి త్రైమాసికానికి రుణ అనుమతులు లభించలేదు. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీల వేలంలో రుణం పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com