Inter Hall Tickets : ఏపీలో నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

Inter Hall Tickets : ఏపీలో నేడు ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
X

ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లను (Intermediate Halltickets) ఇవాళ్టి నుంచి ఇంటర్ బోర్టు జారీ చేయనుంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. 2024 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా, దాదాపు 10 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. రోజు విడిచి రోజు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు హాజరైన ప్రతి విద్యార్ధి హాజరును ఆన్‌లైన్‌లో తీసుకోనున్నారు. పేపర్ లీకేజ్ కాకుండా క్యూ ఆర్ కోడ్ జత చేస్తున్నారు. ఫలితంగా పరీక్ష పేపర్‌ను ఎవరు ఎక్కడ ఫోటో తీసినా లేక స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోనుంది. . ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించాగా.. ఇందులో ఫస్ట్ ఇయర్ 4,73,058 మంది, సెకండ్ ఇయర్ 5,79,163 మంది విద్యార్థులు ఉన్నారు.

ఏపీ ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ :

మార్చి 1- శుక్రవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చి 4 - సోమవారం - ఇంగ్లిష్ పేపర్-1

మార్చి 6 - బుధవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

మార్చి 9 - శనివారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మార్చి 12 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

మార్చి 14 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్ అండ్‌ మ్యూజిక్ పేపర్-1

మార్చి 16 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

మార్చి 19 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఏపీ ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ :

మార్చి 2 - శనివారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

మార్చి 5 - మంగళవారం - ఇంగ్లిష్‌ పేపర్-2

మార్చి 7 - గురువారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.

మార్చి 11 - సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

మార్చి 13 - బుధవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

మార్చి 15 - శుక్రవారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్ అండ్‌ మ్యూజిక్ పేపర్-2

మార్చి 18 - సోమవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

మార్చి 20 - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

Tags

Next Story