AP: సునీల్ కుమార్‌పై చర్యలు తప్పవా..?

వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత జూలైలో సునీల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇవి ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. వీటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులుజారీ చేసింది. సునీల్ స్పందన వచ్చాక ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా సునీల్ కుమార్ చేసిన ఆరోపణలపై నగరం పాలెం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై ఈ ఏడాది జూలై 12న సోషల్ మీడియా ద్వారా సునీల్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సునీల్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్‌లో ఉంచిన ప్రభుత్వం.. 15 రోజుల్లోపు అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏం చెప్తారో..
అలాగే ప్రభుత్వానికి సమాధానం ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ప్రభుత్వం పీవీ సునీల్ కుమార్ ను హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి ఏ వివరణ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన్ను కూటమి సర్కార్ బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. ఇప్పుడు అభియోగాలు నిజమని తేలితే ఏ చర్యలు తీసుకోబోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
చర్యలు తప్పవా..?
ప్రభుత్వం పద్దతి ప్రకారం చర్యలు ప్రారంభించింది. ఆయనపై సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని చార్జెస్ నమోదు చేశారు. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆయన వివరణ ఎలా ఇచ్చినా సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తనపై ఆధారాలు లేవని..తన కాల్ రికార్డులు ఏవీ ఉండవని అంటున్నారు. తెలివి తేటలు తనకు ఒక్కడికే ఉంటాయన్నట్లుగా మాటలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయన ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని చర్యలు తీసుకోవడానికి ప్రభత్వం సిద్ధమయింది. ఇప్పటికే చాలా కేసుల్లోఆయన ప్రమేయం ఉంది. రఘురామ కేసులో నేరుగా ఆయనను అరెస్టు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. జగన్ ను మానసికంగా సంతోషపర్చడానికి ఎంత మంది టీడీపీ నేతల కుటుంబాలకు మానసిక వేదనను ఈ సునీల్ మిగిల్చారో లెక్కే లేదని విమర్శలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com