NIMMALA: ప్రకాశం బ్యారేజీను బోట్లు ఢీ కొట్టడం వెనక భారీ కుట్ర

NIMMALA: ప్రకాశం బ్యారేజీను బోట్లు ఢీ కొట్టడం వెనక భారీ కుట్ర
కట్టడాలను తాకుంటే 3 జిల్లాలు మాయమయ్యేవన్న నిమ్మల... వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపాటు

ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇరుక్కున్న బోట్లు వెలికితీసేందుకు అధికారులు, బేకం సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆటంకాలు ఎదురవుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్లు ఒక్కొక్కటిగా కాకుండా మూడు బోట్లు కలిపి లింక్ ఉండటంతో బయటకు తీయడంలో సమస్యలు వస్తున్నాయని మంత్రి నిమ్మల చెప్పారు. 40 టన్నులు ఉన్న ఒక్కొక్క బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్‌కి పంపడం దుర్మార్గమని మండిపడ్డారు. బోట్లు కౌంటర్ వెయిట్స్‌ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి అన్నారు. బ్యారేజ్, ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను బయటకు తీసేందుకు విశాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు వస్తున్నాయని తెలిపారు. అలాగే 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ కూడా తీసుకొస్తున్నారని చెప్పారు.


వరద సమయంలో కూడా కోటి యాభై లక్షల విలువ చేసే బోట్లను లంగరు వేసుకోలేదంటేనే ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర జరిగిందని అర్థం అవుతుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్ మీద రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని నారా లోకేష్ సూచించారన్నారు. నేటి సాయంత్రానికి బోట్లు తొలగించే ప్రయత్నం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

సాధ్యం కాలేదు..

ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నులపైనే ఉండటం.. ఇసుకలో కూరుకుపోవడంతో భారీ క్రేన్లు వినియోగించినా భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. పడవల తొలగింపులో ప్లాన్‌-ఏ విఫలం కావడంతో ప్లాన్‌-బీ అమలు చేయనున్నారు. అడ్డంగా పడిన నాలుగు భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి అనుభవమున్న డైవింగ్‌ టీమ్‌లను రప్పిస్తున్నారు. భారీ పడవల తొలగింపు కోసం ప్లాన్‌-ఎ విఫలం కావడంతో ప్లాన్‌-బి అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అడ్డంగా పడిన నాలుగు భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం విశాఖ నుంచి అనుభవమున్న డైవింగ్‌ టీమ్‌లను రప్పిస్తున్నారు. ఈ టీమ్‌ నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు. ఇవాళ ఉదయం ప్రకాశం బ్యారేజీకి చేరుకుని డైవింగ్‌ టీమ్‌లు పని ప్రారంభించనున్నాయి. బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం, లేదా క్రేన్ల సాయంతో పైకిలాగి బ్యారేజీ నుంచి దూరంగా తరలించడం చేస్తామని ఇంజినీర్లు తెలిపారు. బ్యారేజీలోని 67, 68, 69 గేట్ల వద్ద నాలుగు భారీ పడవలు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను బోట్లు ఢీకొన్నాయి.

Tags

Next Story