ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు.. అక్రమాలపై కోర్టుకు వెళ్తామంటున్న టీడీపీ నేతలు

ఏపీ మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు.. అక్రమాలపై కోర్టుకు వెళ్తామంటున్న టీడీపీ నేతలు
పోటీ నుంచి తప్పుకున్నవాళ్లకు స్థాయిని బట్టి 8 లక్షల వరకూ ఆఫర్ చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది

మున్సిపోల్స్‌లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఆఖరు నిమిషం వరకే కాదు.. గడువు దాటాక కూడా కొన్ని చోట్ల ప్రత్యర్థుల నామినేషన్లు విత్‌డ్రా చేయించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్నీ జరిగాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కీలకమైన మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. బెదిరింపులు, ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగా కొన్ని చోట్ల అభ్యర్థులే పోటీ నుంచి తప్పుకుంటే.. మరికొన్ని చోట్ల తప్పుడు పత్రాలతో వాళ్ల నామినేషన్లు విత్‌డ్రా చేయించారు.

విశాఖ కార్పొరేషన్‌లో 4వ డివిజన్‌లో పోటీలో ఉన్న TDP అభ్యర్థి నిన్న ఉదయం వరకూ పోటీలో ఉన్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇంతలో ఏమైందో విత్‌డ్రా అయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమైన TDP బీఫామ్‌ను వేరే అభ్యర్థికి ఇచ్చి పోటీ చేయించింది. ఆర్థిక మూలాలపై దెబ్బకొడతామనే హెచ్చరికల వల్లే ముందు పోటీ చేసిన అభ్యర్థి తప్పుకున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడానికి కూడా బెదిరింపులే కారణమని చెప్తున్నారు. ఒంగోలులోనూ ఓ టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడానికి ఆర్థికంగా దెబ్బకొడతారనే భయమే కారణమని తెలుస్తోంది.

రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, కడపల్లో ఏకగ్రీవాల కోసం జరిగిన దౌర్జన్యాలకు లెక్కే లేదని TDP అంటోంది. అందుకు సాక్ష్యాల్ని కూడా చూపిస్తోంది. తిరుపతి 7వ వార్డులో అభ్యర్థినికి తెలియకుండానే నామినేషన్‌ విత్‌డ్రా అవడం EC దృష్టికి కూడా వెళ్లింది. అటు, కర్నూలు జిల్లా ఆత్మకూరులో ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించడమే కాదు.. పోటీ నుంచి తప్పుకున్నవాళ్లకు స్థాయిని బట్టి 8 లక్షల వరకూ ఆఫర్ చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


Tags

Read MoreRead Less
Next Story