వైసీపీ ప్రభుత్వం రేపు కుక్కలు, గాడిదలపైనా పన్నులు వేస్తుంది : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు.. విశాఖలో టీడీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు.. గాజువాకలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అరాచకాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ ఎజెండా అన్నారు. అప్పులు చేస్తూనే ఉంటామని మంత్రులు చెబుతున్నారని.. వాటిని తిరిగి ఎవరు కడతారని చంద్రబాబు ప్రశ్నించారు..
విశాఖలో అరాచకాలు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలపై ధ్వజమెత్తారు చంద్రబాబు. విశాఖకు ఏటూ శని పట్టుకుందన్నారు. దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం పన్నులు వేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు కుక్కలు, గాడిదలపైనా పన్నులు వేస్తారంటూ ఎద్దేవా చేశారు. గాడిదలపై పన్నేంటని అవి కూడా నిరసన తెలిపే రోజువస్తుందన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com