ఏకగ్రీవాల్లో నెరవేరని అధికార పార్టీ టార్గెట్
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 3335 పంచాయతీ, 33వేల632 వార్డు స్థానాలకు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు సర్పంచ్‌లకు 2598, వార్డు స్థానాలకు 6421 నామినేషన్లు వేశారు. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 4760, వార్డు స్థానాలకు 19,659 నామినేషన్లు వేశారు. ఫిబ్రవరి 13న పోలింగ్, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలిస్తారు. 8న మధ్యాహ్నం మూడు గంటలలోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని అదే రోజు తుది జాబితాను ఖరారు చేస్తారు. 13వ తేదీ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు 4 గంటలకు కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటారు.
మరోవైపు.. తొలివిడతలో 1315 పంచాయతీలుకు ఎన్నికలు జరగనుండగా.. వీటిలో 478 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 96 ఏకగ్రీవం కాగా, గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54, కడప జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 40, తూర్పుగోదావరి జిల్లాలో 28, శ్రీకాకుళం 34, విశాఖ పట్నం 32, కృష్ణా 20, ప్రకాశం 16, నెల్లూరు 14, అనంతపురం జిల్లాలో 6 ఏకగ్రీవమయ్యాయి.
ఏకగ్రీవాల కోసం నామినేషన్ల ఉపసంహరణపై వైసీపీ నేతలు దృష్టిపెట్టగా.. అభ్యర్ధుల్ని ఎలాగైనా బరిలో ఉంచేలా చూడాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం కొలికి రావడంతో.. అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను పంచాయతీ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. వీటికి సీల్ వేసి భారీ భద్రత నడుమ కౌంటింగ్ సెంటర్లకు తరలించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com