మొదటి దశ ఎన్నికలకు నేడు నామినేషన్లు ఉపసంహరణ

మొదటి దశ ఎన్నికలకు నేడు నామినేషన్లు ఉపసంహరణ
X
ఎన్ని ఏకగ్రీవాలో కూడా నేడు తెలియనున్నాయి.

మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు ఎన్ని ఏకగ్రీవాలో కూడా నేడు తెలియనున్నాయి.

అటు రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. 13 జిల్లాల్లో కలిపి బుధవారం మొత్తం 25వేల 576 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచి స్థానాలకు 5,081.. వార్డు సభ్యుల స్థానాలకు 20,495 మంది నామినేషన్లు వేశారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 13వ తేదీని ఎన్నికలు జరగనున్నాయి.


Tags

Next Story