పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు

పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు
వైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రజల మంచి కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు బాగుంటే..ప్రజల మద్దతూ దానికి ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఓటరు తీర్పు కూడా కాస్త అధికరంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రస్తుత పంచాయితీ పోరులో మాత్రం ఆ పరిస్థితి ఏమాత్రం లేదు. వైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది. కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం పంచాయితీ పోరులో అభ్యర్థులని బెదిరించడం,ప్రలోబాలకు గురిచేయడం, మాట వినని వారిపై అక్రమ కేసులు బనాయించడం చెప్పుకోవచ్చు. అన్నింటికీ మించి వారు ఆశించిన స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోలేక పోవడం విశేషం.

కర్నూలు జిల్లా విషయానికి వస్తే..మొదటి విడతలో 193 పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో వైసీపీ మద్దతుదారులకి ఏమాత్రం తగ్గకుండా పెద్ద మొత్తంలో ప్రతి పక్ష పార్టీలకు చెందిన మద్దతుధారులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్ల పర్వం ముగిసే నాటికి సింగిల్ డిజిట్ లో దాఖలు అయినవి కేవలం 8 మాత్రమే ఉన్నాయి..అంటే పోటీ తీవ్రత స్పష్టంగా కనిపించింది..నామినేసన్లు ఉపసంహరణ దగ్గరికి రాగానే స్థానిక అధికార పార్టీ నేతలు లొంగదీసుకోవడం,అగ్రమెంట్ లు హామీలు మాటవినని విరిపై బెధిరింపులకు దిగడంతో కొన్ని పంచాయితీల్లో బలవంతపు ఉపసంహరణలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొదటి దశ 193 పంచాయితీల్లో 52 ఏకగ్రీవాలు అయ్యాయి. దీంతో మిగిలిన 141 పంచాయితీల్లో ఈ నెల 9 న ఎన్నికలు జరగనున్నాయి..మొత్తం 374 మంది సర్పంచ్ అభ్యర్థులు భరిలో నిలిచారు. రుద్రవరం మండలంలో అత్యధికంగా 56 మంది, దొర్నిపాడు మండలంలో అత్యల్పంగా 18 మంది పోటీలో తలపడుతున్నారు. ఏకగ్రీవాలు అయిన 52 లో 48 వైసీపి కైవశం చేసుకోగా మిగిలిన నాలుగింటిలో రెండు టీడిపి రెండు ఇండిపెండెంట్ లు గెలుచుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 28 ఏకగ్రీవాలు కాగా, నంద్యాలలో 9, శ్రీశైలం పరిధిలో 15 ఏకగ్రీవాలు అయ్యాయి. ఇక మేజర్ పంచాయితీలు అయిన శిరివెళ్ల,ఎర్రగుంట్ల,రుద్రవరం,చాగలమరి ,యాళ్లూరు,వెలుగోడు పంచాయితీల్లో ప్రధాన పార్టీల మద్దతుధారుల మధ్య పోటీ నెలకొంది.

అయితే జిల్లాలో ఇద్దరు ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపి నేతలే లీడింగ్ లో ఉన్నారు. దీనికి తోడూ నంద్యాల సెగ్మెంట్ లో మంత్రి బుగ్గన,కర్నూలు సెగ్మెంట్ లో మరో మంత్రి గుమ్మనూర్ జయరాం,ఇంచార్జి మంత్ర అనీల్ అందరూ సమావేశం అయ్యారు. ఎలాగైనా సరే పంచాయితీ పోరు అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని సర్వ శక్తులూ ఒడ్డారు. అయినా వారి వేసిన పాచికలు పారలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏడాదిన్నర కాలంలోనే సర్కారు మీద పూర్తిగా వ్యతిరేకత రావడం, పల్లెల్లో ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ది జరగక పోవడంతో పల్లె వాసులు సమయం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు పల్లె పోరుకు అవకాశం రావడంతో ధైర్యంతో అధికారపార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. పోటీలో నిలిచారు ఏకగ్రీవాలకు చెక్ పెట్టారు.


Tags

Read MoreRead Less
Next Story