CBN: బాబు సంతకాలు.. జనం సంబరాలు

CBN: బాబు సంతకాలు.. జనం సంబరాలు
X
చంద్రబాబు తన మార్క్ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు … మెగా డీఎస్సీ హామీ నెరవేర్చడంపై నిరుద్యోగుల ఆనందం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు తన మార్క్ పాలన మొదలుపెట్టారని రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం తొలిరోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేయడంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీకి చంద్రబాబు శ్రీకారం చుట్టడంతో గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. ప్రదర్శనలో యువతకు మద్దతుగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. నిరుద్యోగుల ఐదేళ్ల నిరీక్షణకు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే తెరదించారని హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు రాకతో.... రాష్ట్రంలో ఉద్యోగ మేళా మొదలైందని యువత ఆనందం వ్యక్తం చేశారు.


కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తూ గోనెగండ్లలో జగన్ ఫోటో ఉన్న పాసుపుస్తకాల ప్రతులు దహనం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల M.P.D.O కార్యాలయంలో చంద్రబాబుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మొదటిరోజే 5 హామీల అమలుపై సంతకాలు చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారని... శింగనమల MLA బండారు శ్రావణిశ్రీ అన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్ యాక్ట్‌ రద్దును స్వాగతిస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చంద్రబాబు ఫొటోకు న్యాయవాదులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లాగుంతకల్లులో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

N.T.R. జిల్లా నందిగామ MLA తంగిరాల సౌమ్య కార్యాలయంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి... తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పింఛన్ల పెంపుపై... లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా డీఎస్సీని స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెనాయుడుకు ధన్యవాదాలు చెబుతూ, నిరుద్యోగ యువత సంబరాలు జరుపుకున్నారు. ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకున్నారంటూ నిరుద్యోగులు, యువత హర్షం వ్యక్తం చేశారు. మెగా DSC పై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలోని S.V.U. పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Tags

Next Story