AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కొనసాగుతున్న హర్షాతిరేకాలు

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కొనసాగుతున్న హర్షాతిరేకాలు
X
రద్దు చేసిన చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ రమేష్‌ ధన్యవాదాలు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సంబరాలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు.... విశ్రాంత ఐఏఎస్ P.V.రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు. కృష్ణా జిల్లా విన్నకోటలో తన తండ్రి పట్టా భూమిని మ్యుటేషన్ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీవోకు పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే వెనక్కి పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టం రాకముందే భూములపై హక్కులు నిరాకరించారని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజలు ఈ చట్టంతో ఏమైపోతారో అని అప్పట్లోనే P.V.రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదేనంటూ ఇప్పటికీ జగన్ చెప్పడం సరికాదన్నారు.


ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరమే ఉండదంటూ ఆధారాలతో సహా స్పష్టత ఇచ్చారు. సెక్యూర్ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానం అమలు చేయాలని నీతిఅయోగ్ సలహామండలి సూచించిన విషయం ప్రస్తావించారు. 200 ఏళ్ల ముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కు రైత్వారీ సెటిల్మెంట్ జరిగిందని స్పష్టంచేశారు. రైత్వారీ సెటిల్మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుంచి సమర్థంగా పనిచేస్తోందన్నారు. అవసరం లేని చోట అవగాహనా లోపంతో గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు తన మార్క్ పాలన మొదలుపెట్టారనిరాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ధ్వర్యంలో కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. ప్రదర్శనలో యువతకు మద్దతుగా.,... గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. నిరుద్యోగుల ఐదేళ్ల నిరీక్షణకు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే తెరదించారని హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు రాకతో రాష్ట్రంలో ఉద్యోగ మేళా మొదలైందని యువత ఆనందం వ్యక్తం చేశారు.

Tags

Next Story