AP : రాయి పెట్టి కొట్టినవాడిని పట్టిస్తే రూ.2 లక్షల ప్రైజ్ మనీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై రాయితో దాడి చేసివారిని పట్టుకోవడంపై ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టారు. ఏపీ సీఎం జగన్ ఫై జరిగిన రాయి దాడికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు.
విజయవాడలో జగన్ యాత్ర చేస్తుండగా.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి బలంగా రాయి విసిరాడు. ఈ రాయి సరిగ్గా జగన్ ఎడమ కంతకు తగిలింది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. జగన్‌కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
డాక్టర్ల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి తగిలిన గాయానికి చికిత్స తీసుకున్నారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్న జగన్.. సోమవారం తిరిగి తన యాత్రను నుదుటన కట్టుతోనే కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్లో ఓ రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాయితో కొట్టినవారి సమాచారం ఇస్తే వారికి రూ.2 లక్షలు ఇస్తామని వారి పేరు బయట ఎవరికీ చెప్పబోమని బెజవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com