AP: వైద్య కళాశాలలపై వైసీపీ విషం

ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వీటిలో నాలుగు కాలేజీలు మొదటి దశ లో ప్రారంభం కానున్నాయి.. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఇక్కడే అసలు గొడవ మొదలయింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది..ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కాలేజీలు ఏర్పాటు చేస్తోందని.. విమర్శలు చేస్తోంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. తాము 17 మెడికల్ కాలేజీలు తెస్తే. 5 ప్రారంభం అయ్యాయన్నారు. 4 వేలకు పైగా సీట్లు అందుబాటులో కి వచ్చాయన్నారు జగన్.. కేవలం ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ధరదత్తం చెయ్యడానికి మాత్రమే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తోందన్నారు జగన్.
టీడీపీ సోషల్ యుద్ధం
ఈ ఆరోపణలపై టీడీపీ మండిపడింది. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెజికల్ కాలేజీలు ఇవేనంటూ పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. బిల్డింగులు ఎక్కడ అయ్యా అని అడిగితే, ఫేక్ సాక్షిలో VFX గ్రాఫిక్స్ చూపిస్తారు.. ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తారు. జగన్ మాయా ప్రపంచంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల కధల్లో, ఈ "బాపట్ల మెడికల్ కాలేజీ" మరో మాయ.. జగన్ చేసే ఫేక్ రాజకీయం ఇదిగో ఇలాగే ఉంటుందిని వీడియోను పోస్టు చేశారు.
వైసీపీ నేతల ఫొటో ప్రచారం
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలను ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కలిసివచ్చే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైసీపీ హయాంలో నిర్మాణం ప్రారంభమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ ముందు అమర్నాథ్ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమి కూడా ప్రైవేట్ పరం అవుతోందని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విమర్శలు చేస్తున్నారు.. మెడికల్ కాలేజీల ఏర్పాటు వెనక పెద్ద స్కామ్ ఉందన్నారు.. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ను తాము వ్యతిరేకిస్తున్నాం అన్నారు విడుదల రజని.. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే పేద వాళ్ల పరిస్థితి ఏంటన్నారు రజని సహా అనేక మంది నేతలు విమర్శిస్తున్నారు..
విష ప్రచారం అంటున్న టీడీపీ
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం చెబుతోంది.. ఆసుపత్రులు ప్రైవేట్ పరం అంటూ విషం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కోల్పోయి రాష్ట్రంలో నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే వైసీపీ ఉందని.. తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.. తాను 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేస్తుందని విష ప్రచారానికి జగన్ తెర తీశారని.. పీపీపీ విధానం లో మెడికల్ కాలేజ్ లు పూర్తి చేసి సీట్లు అందుబాటులోకి తెస్తుంటే ప్రైవేట్ పరం అంటూ గగ్గోలు పెడుతున్నారని ప్రభుత్వం మండిపడుతోంది. వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వాస్తవాలను దాచి వక్రీకరణ చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. కేంద్రం 2019-24 మధ్య కాలంలో కొత్త విధానంలో భాగంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ లు మంజూరు చేసిందని గుర్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com