AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు.!

AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు.!
X
కొత్త జిల్లాలు, సరిహద్దుల మార్పుపై కసరత్తు.. అసెంబ్లీ సమావేశాల నాటికే నిర్ణయాలు ?.. తుది కసరత్తు చేస్తున్న మంత్రుల సబ్‌ కమిటీ.. మండలాలు, గ్రామాల సర్దుబాట్లపై చర్చ

ఏపీ­లో కొ­త్త జి­ల్లా­ల­పై కస­ర­త్తు వే­గ­వం­త­మైం­ది. అసెం­బ్లీ వర్షా­కాల సమా­వే­శా­ల­లో­పే ప్ర­భు­త్వా­ని­కి ని­వే­ది­క­ని ఇవ్వా­ల­ని మం­త్రి­వ­ర్గ ఉప­సం­ఘం భా­వి­స్తోం­ది. ఆ ని­వే­ది­క­పై చర్చిం­చి ని­ర్ణ­యం తీ­సు­కొ­నుం­ది. అయి­తే పె­ద్ద­గా మా­ర్పు­లు ఉం­డ­క­పో­వ­చ్చ­ని తె­లు­స్తోం­ది. రెం­డు మూడు జి­ల్లాల ఏర్పా­టు­తో పాటు కొ­న్ని చో­ట్ల హద్దు­లు మా­ర్చే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం. వై­స్సా­ర్సీ­పీ హా­యాం­లో పరి­పా­లన సౌ­ల­భ్యం కోసం 13 జి­ల్లా­ల­ను 26 జి­ల్లా­లు­గా వి­భ­జిం­చా­రు. అయి­తే, ఇం­దు­లో­ని గం­ద­ర­గో­ళం ఉం­ద­ని మా­ర్పు­లు అవ­స­ర­మ­ని భా­విం­చిం­ది ప్ర­స్తుత కూ­ట­మి ప్ర­భు­త్వం. ఇం­దు­లో భా­గం­గా కొ­త్త జి­ల్లాల ఏర్పా­టు­తో పాటు మం­డ­లా­లు గ్రా­మాల సరి­హ­ద్దు­లు పే­ర్ల మా­ర్పు సర్దు­బా­ట్ల­పై అధ్య­య­నా­ని­కి ఏడు­గు­రు మం­త్రు­ల­తో ఉప­సం­ఘా­న్ని ఏర్పా­టు చే­సిం­ది. ఈ సబ్ కమి­టీ ఇప్ప­టి­కే ప్ర­జ­లు ప్ర­జా ప్ర­తి­ని­ధుల అభి­ప్రా­యా­ల­ను సే­క­రిం­చిం­ది. అం­తే­కా­కుం­డా వి­న­త­ల­ను కూడా స్వీ­క­రిం­చిం­ది. వీ­ట­న్ని­టి­పై త్వ­ర­లో ఉప­సం­ఘం చర్చిం­చి అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు ముం­దే ప్ర­భు­త్వా­ని­కి ని­వే­ది­క­ను ఇవ్వ­నుం­ది. అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు ముం­దే ప్ర­భు­త్వా­ని­కి ని­వే­దిక ఇవ్వా­ల­ని ఉప­సం­ఘం లక్ష్యం­గా భా­వి­స్తోం­ది. కొ­త్త జి­ల్లాల ఏర్పా­టు­తో పాటు మం­డ­లా­లు, గ్రా­మాల సరి­హ­ద్దు­లు, పే­ర్ల మా­ర్పు­ల­పై కూడా అధ్య­య­నం చే­స్తు­న్నా­రు. దీ­ని­పై తుది కస­ర్తుత జరు­గు­తోం­ది.

కొత్తగా మూడు జిల్లాలు...

ప్ర­కా­శం జి­ల్లా­లో మా­ర్కా­పు­రం కేం­ద్రం­గా కొ­త్త జి­ల్లా ఏర్పా­టు చే­యా­ల­నే ప్ర­తి­పా­దన ఉంది. గి­ద్ద­లూ­రు, కని­గి­రి, మా­ర్కా­పు­రం, యర్ర­గొం­డ­పా­లెం, దర్శి ని­యో­జ­క­వ­ర్గా­ల­తో మా­ర్కా­పు­రం కొ­త్త జి­ల్లా­ను ఏర్పా­టు చేసే అవ­కా­శం ఉంది. బా­ప­ట్ల జి­ల్లా­లో­ని అద్దం­కి, నె­ల్లూ­రు జి­ల్లా­లో­ని కం­దు­కూ­రు ని­యో­జ­క­వ­ర్గా­ల­ను తి­రి­గి ప్ర­కా­శం జి­ల్లా­లో కలి­పి­తే ప్ర­జ­ల­కు సౌ­క­ర్యం­గా ఉం­టుం­దం­టు­న్నా­రు. ఈ రెం­డు ని­యో­జ­క­వ­ర్గా­ల­ను ప్ర­కా­శం జి­ల్లా­లో కలి­పి­తే ఒం­గో­లు, కొం­డ­పి, సం­త­నూ­త­ల­పా­డు­తో కలి­పి మొ­త్తం ఐదు ని­యో­జ­క­వ­ర్గా­లు అవు­తా­యి. దీ­ని­వ­ల్ల రెం­డు జి­ల్లా­లు సమా­నం­గా ఉం­టా­యం­టు­న్నా­రు. బా­ప­ట్ల జి­ల్లా­లో­ని అద్దం­కి నె­ల్లూ­రు జి­ల్లా­లో­ని కం­దు­కూ­రు ని­యో­జక వర్గా­ల­ని మళ్ళీ ప్ర­కా­శం జి­ల్లా­లో కలి­పి­తే అక్క­డి ప్ర­జ­ల­కు సౌ­క­ర్యం­గా ఉం­టుం­ద­న్న అభి­ప్రా­యం ఉంది.. దా­న్ని కూడా పరి­శీ­లిం­చే అవ­కా­శం ఉంది. ఇక అమ­రా­వ­తి కేం­ద్రం­గా కొ­త్త­గా అర్బ­న్ జి­ల్లా ఏర్పా­టు ప్ర­తి­పా­దన కూడా ఉంది. రా­జ­ధా­ని పరి­ధి­లో­ని 29 గ్రా­మా­లు గుం­టూ­రు జి­ల్లా మం­గ­ళ­గి­రి, తా­డి­కొండ ని­యో­జక వర్గా­ల్లో­కి వస్తా­యి. వీ­టి­తో పాటు పె­ద­కూ­రు­పా­డు, నం­ది­గామ, జగ్గ­య­పేట ని­యో­జక వర్గా­లు భౌ­గో­ళి­కం­గా అమ­రా­వ­తి­కి దగ్గ­ర­గా ఉం­టా­యి. కొ­త్త అర్బ­న్ జి­ల్లా ఏర్పా­టు చే­స్తే ఐదు ని­యో­జక వర్గా­లు అయ్యే అవ­కా­శం ఉం­టుం­ది. గుం­టూ­రు తూ­ర్పు, పశ్చిమ, పత్తి­పా­డు, పొ­న్నూ­రు, తె­నా­లి కలి­పి ఐదు ని­యో­జక వర్గా­లు అవు­తా­యి.

Tags

Next Story