Bharat Rice : ఏపీలోనూ రూ.29ల భారత్ రైస్.. ఆ జిల్లా నుంచే మొదలు

Andhra Pradesh ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందింది. కిలో కేవలం రూ. 29కే లభించే భారత్ బియ్యం త్వరలోనే ఏపీకి కూడా రానుంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా మరో 10 రోజుల్లోనే రూ.29ల భారత్ రైస్ సేల్ మొదలుపెట్టనున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే విజయవంతంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ దుకాణాల ద్వారా అమ్మకాలు చేపట్టనున్నట్లు వివరించారు.
బియ్యం రేట్లు కిలో 60 రూపాయలకు చేరిపోయాయి. నగరాల్లో అయితే భగ్గుమంటున్నాయి. ఏటికేడు పెరుగుతున్న బియ్యం రేట్లతో జనం విసిగివేసారిపోయారు. భారత్ రైస్ వారికి మంచి ఆల్టర్ నేటివ్ లా అనిపిస్తోంది. అందుకే.. భారత్ రైస్ కోసం ఆన్ లైన్ లో అప్లే చేసుకుంటున్నారు జనాలు. త్వరలోనే పలు ప్రముఖ రీటైల్ ఔట్ లెట్లలోనూ భారత్ రైస్ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల అమ్మకాలు మొదలుకానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com