AP Voters : ఏపీ ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు: సీఈవో ముకేశ్

4.14 కోట్ల మంది ఓటర్లు(సర్వీస్ ఓటర్లు 65,707) ఉన్నారని CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఒక్కో సెంటర్‌లో 1,500 మంది ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేశాం. కోడ్ ఉల్లంఘనలపై 864 FIRలు, సీజ్‌లకు సంబంధించి 9 వేల కేసులు నమోదు చేశాం. సీ విజిల్ యాప్ ద్వారా 16,345 ఫిర్యాదులొచ్చాయి. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి’ అని తెలిపారు.
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని సా.6 గంటల వరకు పెంచాలని ఈసీని టీడీపీ కోరింది. మధ్యాహ్నం ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదని, సమయాల్లో స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల ఈసీకి లేఖ రాశారు. దీంతో పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పార్టీల వినతి మేరకు తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు ఈసీ పెంచింది.
ఏపీ వ్యాప్తంగా నిన్నటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సహా పలుచోట్ల ఉదయం నుంచే అధికారులు ఇళ్లకు వెళ్లి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల నుంచి ఓట్లు స్వీకరిస్తున్నారు. హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ నెల 10వ తేదీ వరకు వెళ్లి అధికారులు ఓట్లు స్వీకరిస్తారు. అటు తెలంగాణలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com