AP: కౌంటింగ్‌ను బహిష్కరించిన వైసీపీ

పులివెందుల, ఒంటిమిట్టజడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 10 టేబుల్లలో ఒక రౌండ్ ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుల్లలో మూడు రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే, కౌంటింగ్‌ను వైసీపీ బహిష్కరించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు తెలిపారు.
టీడీపీ గెలుపు ఖాయం..!
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను వైసీపీ బహిష్కరించడం సంచలనంగా మారింది. ఓట్ల లెక్కింపు ఆరంభమైన కాసేపటికే వైసీపీ కౌంటింగ్‌ను బహిష్కరించడంతో ఆ పార్టీ ఓటమిని ముందే అంగీకరించిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతల మాటలను పరిశీలిస్తే ఓటమి ఖాయమనే ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. కౌంటింగ్ బహిష్కరణతో ఇప్పుడు ఆ వాదనలకు మరింత బలం చేకూరింది.
విమర్శలకు సమాధానం
2021లో జరిగిన కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో 52 స్థానాలకు 49 సీట్లను ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. అందులో మూడు సీట్లకు ఎన్నికలు జరిగితే వాటిని వైసీపీ సొంతం చేసుకుంది. వందకు 100 శాతం వైసీపీ గెలిచింది. ప్రజాస్వామ్యంలో అది సాధ్యమా? అన్నది తొలి ప్రశ్న. తొలిసారి పులివెందులలో ఎన్నిక జరిగింది. కేడర్ చెదిరిపోకుండా బీటెక్ రవి ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఈసారి కచ్చితంగా పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. హైకమాండ్ నుంచి అండదండలు ఉండడం, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారం కలిసి వచ్చిందని అంటున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీ పతనానికి కారణమని అంటున్నారు స్థానికులు. పులివెందులతోపాటు ఒంటిమిట్ట కూడా టీడీపీకే ఎడ్జ్ ఉందని అంటున్నారు. ఈ ఉప ఎన్నిక నుంచి జగన్ పాఠాలు నేర్చుకుంటారా? అన్నది చూడాలి. జగన్ అడ్డాలో వైసీపీ అధినేతకు షాక్ ఇస్తుందా..? లేక ఓటమిని చవిచూస్తుందా..? ఈ ఎన్నికలతో 35 ఏళ్ల తర్వాత పులివెందులలో పసుపు జెండా ఎగురుతుందా అన్న ప్రశ్నలకు ఇవాళ్టీ ఫలితాలతో స్పష్టత రానుంది. ఏదిఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కాక రేపిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాల ఫలితాల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com