APSRTC : ఏపీఎస్ఆర్టీసీ బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదం అర్థరాత్రి 1.45 నిమిషాలకు జరిగింది. ప్రయాణికులు అప్పుడే నిద్రలోకి జారుకున్నారు. అయితే బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు కిందుకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్‌తోపాటు ఇతర ప్రయాణికులు మెలకువ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చేశారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మెుత్తం 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు పాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అంతే ప్రయాణికులను రక్షించిన రెప్పపాటు వ్యవధిలోనే బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికి ఎలాంటి ప్రయత్నం లేకుండా పోయింది. ఇకపోతే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com