టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధం-అచ్చెన్నాయుడు

టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధం-అచ్చెన్నాయుడు
Atchannaidu: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది.

Atchannaidu: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. టీడీపీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. తొలుత సదస్సు నిర్వహించి అంశాల వారీగా చర్చించనుంది. తరువాత క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు వివరించనుంది. ఈ మేరకు తాజాగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు కళావెంకటరావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొంటారు.

ఉత్తరాంధ్ర సమస్యలను ఈ ప్రాంత మంత్రులు సీఎం జగన్‌ వద్ద ప్రస్తావించగలరా.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌పై గతంలో వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ ఏం చేసిందో చెబుతామని.. మీరేం చేశారో చెప్పగలరా? అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

రైతుల భూముల్లో జగన్‌ వ్యాపారం చేస్తున్నారని.. మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. సింహాచలం భూములు మాయమయ్యాయని ఆరోపించారు. ఇక జగన్‌కి జ్ఞానం కలిగించమని పైడితల్లి అమ్మవారిని కోరుకుంటానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వం కొనసాగుతుందని.. టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్ర పరిస్థితి మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు ఉందన్నారు. ఇక ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story