AP : పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు

AP : పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు శేషగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హైకోర్టు ఆదేశాలున్నా పిన్నెల్లిపై మరో తప్పుడు కేసు పెట్టారని వైసీపీ మండిపడుతోంది.

మాచర్ల వెళ్లద్దు – పిన్నెల్లికి హైకోర్టు ఆదేశంఈవీఎంల ధ్వంసం కేసు లో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డికి మధ్యంతరం బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

జూన్‌ 6 వరకు మాచర్ల వెళ్ల కూడదు. పార్లమెంటు నియోజ కవర్గ కేంద్రం నర్సరావుపేటలో ఉండాలి. 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు మాత్రమే హాజరు కావాలి. ఈవీఎంల ధ్వంసం వ్యవహారంపై మీడి యాతో మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. ఆయన కథలికలపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్‌కు, పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

Tags

Next Story