ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ పాలిస్తున్నారు : అయ్యన్నపాత్రుడు

X
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం జగన్ పాలిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం చూస్తే.. ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో తెలుస్తోందని అన్నారు. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజా నోటిఫికేషన్ కోసం జనసేన కోర్టును ఆశ్రయించిందని.. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అకస్మాత్తుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం బాధాకరం అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
