AP : బీసీ స్కీమ్ బ్లాక్ బస్టర్.. రాత మారుస్తామన్న లోకేశ్

AP : బీసీ స్కీమ్ బ్లాక్ బస్టర్.. రాత మారుస్తామన్న లోకేశ్

Ap : ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ బ్లాక్ బస్టర్ మరికొద్ది వారాల్లోనే రిలీజ్ కానుంది. దీనికోసం ఓటర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గెలుపు ఎవరిది అనేది కూడా అంచనాలు అందకపోవడంతో విశ్లేషకుల దిమాక్ లు దిమ్మతిరిగిపోతున్నాయి. ఓటరు నాడి ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆంధ్రలో గెలుపు ఓటములను డిసైడ్ చేసే న్యూట్రల్ ఓటర్లు బాబు, జగన్ లలో ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

మార్చి 5నాడు టీడీపీ-జనసేన కూటమి 'జయహో బీసీ' సభతో ఓ తురుఫుముక్క లాంటి స్కీమ్ ను వదిలింది. వెనుకబడిన తరగతుల (బిసి) డిక్లరేషన్‌ను ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ కింద.. టీడీపీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4000 పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు నేతలు. సభ తర్వాత నారా లోకేశ్ స్పందించారు. బీసీలపై జగన్ తప్పుడు కేసులు పెట్టారని.. అన్యాయంగా చాలామందిని చంపేశారని ఆరోపించారు. బీసీలకు తాము రక్షణాత్మక ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు.

బీసీ సబ్‌ ప్లాన్‌ కింద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను దారి మళ్లించిందని ఆరోపించారు లోకేశ్. రాష్ట్ర శాసనసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం పొంది కేంద్రప్రభుత్వ ఆమోదానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని టీడీపీ తెలిపింది. బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు స్వయం ఉపాధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పెళ్లి కానుక కింద ఇచ్చే సాయాన్ని రూ.లక్షకు పెంచుతామన్నారు లోకేశ్. ఓవరాల్ గా.. 153 బీసీ కులాలకు న్యాయం చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ అంటేనే చదువుకు పెద్ద పీట వేస్ ప్రభుత్వమన్న లోకేశ్.. రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి విదేశీ విద్యను అమలు చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story