Ap Cm Jagan : దశాబ్దాలుగా ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారించాం- జగన్

రాష్ట్రంలోదశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించామని సీఎం జగన్ అన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు , లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల భూములు, సర్వీస్ ఇనాం భూముల ఇబ్బందులు తొలగించామని సీఎం తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ...విపక్షాలన్నీ కలిసి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయని జగన్ పునరుద్ఘాటించారు. తమ పొత్తు మాత్రం ప్రజలతోనేనని చెప్పుకొచ్చారు.
తరతరాలుగా భూములు సాగు చేసుకుంటున్నా... వాటిపై యాజమాన్య హక్కులు పొందలేక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక, అవసరానికి అమ్ముకోలేక సతమతమయ్యారన్నారు. అందుకే అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన కార్యక్రమంలో...అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు....లంక భూములకు పట్టాలు అందజేశారు. వీటితోపాటు వివిధ రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న రైతులకు.....భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్న సీఎం.....ఆయా గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... సీఎం జగన్ అన్నారు. గతంలో కలసి పనిచేసిన వారంతా... ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ దగ్గరయ్యారని జగన్ విమర్శించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై తనకు పూర్తి అవగాహన ఉందన్న సీఎం.....త్వరలోనే దీనిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com