Bhuma Akhila Priya: పెంచిన కరెంట్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి: అఖిల ప్రియ

X
Bhuma Akhila Priya (tv5news.in)
Bhuma Akhila Priya: మూడేళ్ల పాలనలో ఏడుసార్లు ఛార్జీలు పెంచి వైసీపీ సర్కార్ పేదోళ్ల నడ్డివిరుస్తోందని టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ శిరివెళ్ల మండలకేంద్రంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. లాంతర్లు, కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల నిరసనలో భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చితే వైసీపీ నాయకులు గ్రామాల్లో అడుగు పెట్టలేరని అఖిలప్రియా హెచ్చరించారు. జగన్ సర్కార్ పంచాయతీ సొమ్మును ఖాళీ చేసి పల్లెల్లో అభివృద్ధి కుంటపడేలా చేసిందన్నారు అఖిలప్రియ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
