AP : రఘురామకు బీజేపీ ఝలక్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైరల్ క్యాండిడేట్ రఘురామకృష్ణం రాజు. ఆయన నెమ్మదిగా మాట్లాడినా ఆ మాటలకు పదునెక్కువ. అలాంటి రఘురామకృష్ణ రాజుకు బీజేపీలో టికెట్ ఖాయమని నిన్నటివరకు అనుకున్నారు. ఐతే సీన్ మారింది.
తన రాజకీయ జీవితంలో బీజేపీని ఏనాడూ విమర్శించలేదు రఘురామ. మోదీని ఆయన పొగుడుతూనే ఉంటారు. బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయనకు రెండో సారి బీజేపీ హ్యాండిచ్చింది. 2014 ఎన్నికల సమయంలోనూ ఆయన నర్సాపురం నుంచి పోటీకి బీజేపీ తరపున ఏర్పాట్లు చేసుకుంటే… పొత్తులో భాగంగా సీటు వచ్చినా… గోకరాజు గంగరాజుకు సీటిచ్చారు. తర్వాత ఆయన తప్ప ఆయన కుటుంబీకులంతా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు మరోసారి అలాగే.. రఘురామకు హ్యాండిచ్చారు.
నర్సాపురంలో రఘురామకే టికెట్ గ్యారంటీ అనుకున్నారు. జగన్ పై వీరోచితంగా పోరాడుతున్న ఆయన్ను పక్కన పెట్టడం చాలామందికి అర్థం కావడంలేదు. వైసీపీ వద్దనుకున్న వరప్రసాద్ కు పిలిచి టిక్కెట్ ఇచ్చింది బీజేపీ. దీనిపై ఆదివారం వీడియో రిలీజ్ చేసిన రఘురామ.. నా టికెట్ విషయంలో జగన్ గెలిచారు.. తాను టెంపరరీగా ఓడిపోయాను కానీ.. ఎన్నికల్లో మాత్రం జగన్ ఓడిపోవడం గ్యారంటీ అన్నారు. జగన్ ను వదిలి పెట్టే ప్రశ్నే ఉండదని అంటున్నారు RRR.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com