Allu Arjun : మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ బారిన బన్నీ.. ఆ పని ఎందుకు చేయడం లేదు?

ఫ్రెండ్ కోసం చేసిన ప్రచారం అల్లు అర్జున్ ను ( Allu Arjun ) చిక్కుల్లో పడేసింది. ఇంట్లో తన మామయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ( Pawan Kalyan ) పెట్టుకొని ఆయనకు యాంటీగా వర్క్ చేస్తున్న పార్టీ మెంబర్ కి సపోర్ట్ చేయడం బన్నీకి తలనొప్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా అల్లు ఫ్యామిలీనే మెగా ఫ్యామిలీ దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం పెద్ద చర్చగా మారింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ను అన్ ఫాలో చేయడం ప్రారంభించారని టాక్ నడుస్తోంది. బన్నీతో పాటు స్నేహ రెడ్డి అకౌంట్లను సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేసేసినట్లు చెబుతున్నారు.
అల్లు అర్జున్ వెళ్లి ఒక్కసారి తన మామయ్య పవన్ ను కలిస్తే ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి బన్నీకి ఇష్టం లేదా.. పవన్ టైమ్ ఇవ్వడం లేదా అన్నది తేలాల్సి ఉంది. బన్నీ నంద్యాలలో ఉన్నప్పుడు అల్లు అరవింద్.. రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలోనే పవన్ దగ్గరే ఉన్నారు. మరి అల్లు అరవింద్ ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com