AP : నంద్యాల టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి?

నంద్యాల టీడీపీ ఎంపీ (Nandyala TDP MP) అభ్యర్థిగా బీజేపీజిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి (Byreddy Shabari) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. అనంతరం టీడీపీ చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. మరోవైపు పాణ్యం టీడీపీ టికెట్ ను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరుతున్నట్లు టాక్.
మార్చి 6వ తేదీన నంద్యాలకు చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆ సమయంలో ఆమె చేరికపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీకి చెందిన కొందరు కీలక నాయకులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆమె అనుచరులు, అభిమానులు సోమవారం రాత్రి నగరంలోని పలు కూడలల్లో పెద్దఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు.
సీఎంజగన్ అరాచక పాలనను అంతం చేయాలన్నది తన లక్ష్యమని.. అందుకనుగుణంగానే తన నిర్ణయాలుంటాయని బైరెడ్డి గతంలో ప్రకటించారు. ఆయనకు పాణ్యం టికెట్ ఇవ్వాలంటూ టీడీపీని కోరుతూ ఆయన అభిమానులు ఇటీవల పలు ఫ్లెక్సీలు సైతం పెట్టిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com