AP : పిఠాపురం బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి

X
By - Manikanta |26 April 2024 10:18 AM IST
పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదివిన భాస్కరరావు స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్థానిక సీతయ్యగారితోటలో నివసించే ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకుని చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తూనే ఎంఏ రాజనీతిశాస్త్రం అధ్యయనం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పది మంది బలపరిచారు. నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకున్నారు. ఆయన వద్ద రూ.20 వేల నగదు మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com