తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

X
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బృందావనం అపార్ట్‌మెంట్‌లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు క్రికెట్ కిట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. తమపై ఏవో ఆరోపణలు చేసి కేసులు పెట్టి వేధించడం పోలీసులకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
