AP : ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు.
పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్-భారతి దంపతులు, సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోడూరులో మంత్రి కాకాని గోవర్ధన్, బుర్రిపాలెంలో తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడలోని రైల్వే కల్యాణమండపం పోలింగ్ కేంద్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విజయనగరంలో టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, రాజమహేంద్రవరం వీఎల్ పురంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓటు వేశారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని అపహరించారు. వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రం నుంచి ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో పాటు ఈవీఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com