AP : అమరావతికి రైల్వే లైన్‌పై కేంద్రం గుడ్ న్యూస్

ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతికి ( Amaravathi ) కేంద్రం తీపి కబురు అందించింది. గతంలో అమరావతికి రైల్వేలైను ప్రతిపాదనను మళ్లీ తెర మీదకు తీసుకువస్తూ అమరావతి రైల్వేలైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోయాయి. మరలా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రైల్వే లైన్ కు సంబంధించి రైల్వేశాఖ ఆగమేఘాల మీద స్పందించింది. రైల్వే లైనుకు రాష్ట్రం తన వాటా ఇవ్వాలని, భూసేకరణ వ్యయం భరించాలంటూ గతంలో నిబంధనలు విధించిన రైల్వేశాఖ ఇప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టకుండానే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తిగా స్వంత నిధులతోనే అమరావతికి రైల్వేలైన్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎర్రుపాలెం- అమరావతి-నంబూరుకు 56.53 కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం భూ సేకరణకు వీలుగా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com