Pawan Kalyan : సచివాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఛాంబర్ కేటాయింపు

X
By - Manikanta |17 Jun 2024 5:22 PM IST
సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్‌కు ( Pawan Kalyan ) ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com