ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదు : చంద్రబాబు

ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదు : చంద్రబాబు
అక్రమ కేసులతో ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు చంద్రబాబు.

తన రాజకీయ అనుభవంలో వైసీపీ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఇలాంటి అరాచక ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి వాళ్లు ఎలా ఇబ్బంది పడతారో ఇప్పుడు చూస్తున్నామన్నారు. విజయవాడలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను బాబు పరామర్శించారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగితెలుసుకున్నారు.

అచ్చెన్నాయుడు అనారోగ్యంగా ఉన్నా అరెస్టుచేసి, కరోనా రావడానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ఇద్దరు మాజీ మంత్రులను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story