ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయొద్దు : చంద్రబాబు

పోలవరం లాంటి సున్నితమైన అంశంలోనూ వైసీసీ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.. ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయొద్దని జగన్ సర్కార్‌కు సూచించారు.. పోలవరంపై కేంద్రం చెబుతున్న లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీడియా సమావేశంలో అన్ని నివేదికలను విడుదల చేశారు.. వాస్తవాలను ప్రజల ముందుంచారు.
కేంద్రంతో మాట్లాడుకుని పోలవరాన్ని పూర్తిచేయాల్సింది పోయి తమపై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తోందంటూ చంద్రబాబు ఫైరయ్యారు.. 20వేల కోట్లకే నాడు టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. నాటి కేబినెట్ మీటింగ్ నోట్‌ను మీడియా ముందుంచారు. ఇరిగేషన్ కాంపోనెంట్‌లోనే భూసేకరణ, ఆర్‌అండ్ ఆర్ కలిపి ఉంటాయని.. ఇరిగేషన్ కాంపోనెంట్‌కు 100 శాతం చెల్లింపులు చేస్తామని గతంలో పలు సందర్భాల్లో కేంద్రం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com