Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనల్లో బిజీగా గడిపారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బాబు...తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించారు.
కాకినాడ జిల్లాలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో సమావేశయ్యారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదామిచ్చారు. మరోవైపు... సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నవరంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పొత్తుల ప్రస్తావన తెచ్చారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి ఉందని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమం రావాలని.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని బాబు తేల్చిచెప్పేశారు. అనంతరం...అత్యాచారాలను, హత్యలను ఆపలేని సీఎం జగన్ గద్దెదిగాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నంలో గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం చేయడం దుర్మార్గం అన్నారు. అత్యాచారాలు సర్వసాధారణం అని హోంమంత్రి అనడం బాధనిపించిందన్నారు. సజ్జల రాసిస్తే హోంమంత్రి మాట్లాడుతున్నారన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీ ఆపలేని సీఎం.. 3 రాజధానులు కడతారా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com