వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు

వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు

విధ్వంసం-వినాశనం, దాడులు-దౌర్జన్యాలే వైసీపీ లక్ష్యాలని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, బీసీలు, ఎస్సీలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా దేవాలయాలపైనే దాడికి తెగించారని, ఏ ప్రభుత్వం ఇన్ని అరాచకాలకు పాల్పడలేదని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.

వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. వరద బాధితుల పునరావాసంలోనూ రాజకీయాలు సిగ్గుచేటన్నారు. మంత్రులను వరద బాధితులే నిలదీయడం వైసీపీ వైఫల్యాలకు పరాకాష్ట అని అన్నారు.. గాడితప్పిన పాలకులను ప్రజలే నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story