రైతులపై ఇన్ని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఉందా? :చంద్రబాబు

రైతులపై ఇన్ని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఉందా? :చంద్రబాబు

ధాన్యం కొనుగోలు చేయాలని కోరిన రైతులపై కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ రాక్షసత్వమేనని టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రైతులపై ఇన్ని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెట్టడం రైతులను నమ్మక ద్రోహానికి గురిచేయడమేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు టీడీపీ అండగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

16 నెలల వైసీపీ అవినీతి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖ భూముల్లో వైసీపీ వన్ సైడ్ ట్రేడింగ్, నాసిరకం మద్యం బ్రాండ్ల వన్ సైడ్ ట్రేడింగ్‌పై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలంతా వైసీపీకి దూరం అయ్యారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 16 నెలల్లో 16 శాతం ఓటింగ్‌కు వైసీపీ దూరమైందన్నారు. ఇక దేవాలయాలపై ఇన్ని అకృత్యాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు చంద్రబాబు. మనుషులకే కాదు, దేవుళ్లకు కూడా వైసీపీ పాలనలో రక్షణ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయాలపై వరుస దాడులు చూస్తుంటే రాక్షసుల కాలం గుర్తొస్తోందన్నారు. రాక్షసుల కాలంలో కూడా ఇన్ని ఆగడాలు లేవన్నారు. కులద్వేషాలు, మతద్వేషాలు ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

పల్నాడులో వైసీపీ నాయకుల దుర్మార్గాలకు అంతే లేకుండా పోయిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నా ఇంటిగేట్లకు కట్టిన పసుపుతాళ్లే, వైసీపీకి ఉరితాళ్లని అప్పుడే హెచ్చరించానని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా, ఇతర రాష్ట్రాల ఏపీలోకి అక్రమ మద్యం సరఫరా చేయడం వైసీపీకి నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. పెట్రోల్, డిజిల్ ధరలు 2 నెలల్లో 2 సార్లు పెంచడం హేయమన్నారు. వైసీపీ వచ్చాక ప్రజలపై వేల కోట్ల భారం మోపారని... ఇందుకు తగిన మూల్యం వైసీపీ చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.


Tags

Read MoreRead Less
Next Story