ఆంధ్రప్రదేశ్

Chandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి: చంద్రబాబు

Chandrababu: సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Chandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి: చంద్రబాబు
X

Chandrababu: సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొందని.. ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు.

సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని.. కొంత మంది టెయినెటెడ్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో పోలీసులు కూడా సైకోలా మారుతున్నారా అని ప్రశ్నించారు. తప్పుడు అధికారులను వదిలి పెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES