- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- Chandrababu: జగన్.. నువ్వు...
Chandrababu: జగన్.. నువ్వు రాజకీయాలకు బచ్చావి: చంద్రబాబు

Chandrababu: వైసీపీ సర్కారుపై చోడవరం మినీ మహానాడు సభలో గర్జించారు టీడీపీ అధినేత చంద్రబాబు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రపదేశ్ అంటూ పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని మండిపడ్డారు. దౌర్జన్యపాలనపై బెబ్బులిలా గర్జిస్తామని.. కొండవీటి సింహంలా గాండ్రిస్తామన్నారు. చోడవరం సభతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు.
విశాఖను రాజధాని చేస్తామన్న జగన్.. తట్ట మట్టయినా పోశారా అని నిలదీశారు. రోడ్ల గుంతల్ని పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. విశాఖలో విజయసాయిని మార్చి.. సుబ్బారెడ్డిని తెచ్చారని.. ఉత్తరాంధ్రపై పెత్తనం విజయసాయిదా.. సుబ్బారెడ్డితా అని ధ్వజమెత్తారు. వైసీపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించే సత్తా ఉత్తరాంధ్రకు ఉందన్నారు. జగన్.. ఉత్తుత్తి బటన్లు వద్దు.. నిజమైన బటన్లు నొక్కాలంటూ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేశారన్నారు చంద్రబాబు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని దుయ్యబట్టారు. నాడు నేడు కార్యక్రమంతో దోచుకుంటున్నారన్నారు. ఇక లిక్కర్ దందాలో జగన్‌కు వాటా వెళ్తుందన్నారు. వైసీపీ అరాచకాలకు అంతిమ రోజులు దగ్గరపడ్డాయన్నారు. జగన్ సర్కారును గద్దె దించడం ఖాయమన్నారు చంద్రబాబు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com